న్యూజిలాండ్‌కు షమీ వరుస షాకులు!
- భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ కు ఆదిలోనే చిక్కులు
- ఓపెనర్లు కాన్వే, రచిన్ వికెట్లను పడగొట్టిన షమీ
- 10వ ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 46/2
భారత్ నెలకొల్పిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు షమీ చుక్కలు చూపించడం ప్రారంభించాడు. తొలుత కాన్వే, రచిన్ రంగంలోకి దిగారు. క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్న న్యూజిలాండ్‌కు ఆరో ఓవర్‌లో షమీ తొలి షాకిచ్చాడు. కాన్వేను 13 పరుగులకే పెవిలియన్ బాట పట్టించాడు. 30 పరుగుల వద్దే న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తరువాత కొద్ది సేపటికే రచిన్ కూడా 13 పరుగులకే తన వికెట్‌ను షమీకి సమర్పించుకోవాల్సి వచ్చింది. దీంతో, ఓపెనర్ల వికెట్లు రెండూ షమీ ఖాతాలో పడ్డాయి. పదో ఓవర్ ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 46/2 గా ఉంది. క్రీజులో విలియమ్స్(‘4), మిచెల్(1) ఉన్నారు.