ఇంతకంటే ఆనందాన్ని ఇచ్చేది మరొకటి లేదు.. విరాట్‌పై సచిన్ కామెంట్స్
- సచిన్ వన్డే సెంచరీ రికార్డును అధిగమించిన కోహ్లీ
- కోహ్లీపై క్రికెట్ లెజెండ్ ప్రశంసల వర్షం
- విరాట్‌ను తొలిసారి కలిసిన క్షణాన్ని గుర్తు చేస్తూ ట్వీట్
- నాటి కుర్రాడు ‘విరాట్’గా మారాడంటూ కామెంట్
న్యూజిలాండ్‌తో నేడు జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. 50వ వన్డే సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా సచిన్ రికార్డును అధిగమించాడు. ఏకంగా క్రికెట్ దేవుడే మురిసిపోయేలా చేశాడు. ఈ సందర్భంగా విరాట్ డ్రెస్సింగ్ రూంలో తొలిసారిగా అడుగుపెట్టిన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ సచిన్ నెట్టింట విరాట్‌పై ప్రశంసలు కురిపించాడు.
‘‘ డ్రెస్సింగ్‌లో తొలిసారి నేను నిన్ను కలిసినప్పుడు టీంమేట్స్ నీతో నాకు పాదాభివందనం చేయించి ఆటపట్టించారు. ఆ రోజు నేను నవ్వాపుకోలేకపోయా! అయితే, ఆటపై నీకున్న అనురక్తి, నైపుణ్యంతో నా మనసును తాకావు. నాటి కుర్రాడు ఈ రోజు ‘విరాట్’గా ఎదగడం చూసి నాకెంతో సంతోషంగా ఉంది. మరో భారతీయుడు నా రికార్డు అధిగమించడం కంటే ఆనందాన్నిచ్చేది మరొకటి లేదు. అది కూడా.. వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో నా హోం గ్రౌండ్‌లో ఇది జరగడం నా ఆనందాన్ని మరింత పెంచింది’’ అని సచిన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.