భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 742 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 232 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 3.77 శాతం పెరిగిన టెక్ మహీంద్రా షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 742 పాయింట్లు లాభపడి 65,676కి చేరుకుంది. నిఫ్టీ 232 పాయింట్లు పెరిగి 19,675కి ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన మార్కెట్లకు అండగా నిలిచాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (3.77%), టాటా మోటార్స్ (2.84%), ఇన్ఫోసిస్ (2.69%), విప్రో (2.54%), టాటా స్టీల్ (2.52%).
టాప్ లూజర్స్:
బజాన్ ఫైనాన్స్ (-1.84%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.05%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.97%).