పేదరికం వల్లనే సినిమాల్లోకి ఆలస్యంగా వచ్చాను: 'బలగం' మురళీధర్   

  • 'బలగం'తో పేరు తెచ్చుకున్న మురళీధర్
  • ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ  
  • నటన తన ఆశయమని వ్యాఖ్య 
  • సినిమాల కోసం జాబ్ వదలలేకపోయానని వెల్లడి

'బలగం' సినిమాలో ఇంటి అల్లుడి పాత్రలో మురళీధర్ గౌడ్ నటనను ప్రేక్షకులు మరిచిపోలేరు. ఆ సినిమాతో ఆయనకి మరింత గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తరువాత నటుడిగా ఆయన మరింత బిజీ అయ్యారు. తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను పంచుకున్నారు. 

"నటించాలి .. నటుడిగా పేరు తెచ్చుకోవాలనేది నా ఆశయం. నటన పట్ల ఆసక్తి ఉన్నవారు వేరే పని చేయలేరని అంటూ ఉంటారు. అయితే నటించాలనే కోరిక నాలో బలంగా ఉన్నప్పటికీ, ఆ కోరికను బలవంతంగా అణచుకుంటూ నేను ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చాను .. అందుకు కారణం పేదరికం" అని చెప్పారు. 

"నేను చేసే జాబ్ నా కుటుంబానికి చాలా అవసరం. నా తల్లిదండ్రులను .. నా పిల్లలను పోషించుకోవడానికి నాకు అంతకు మించిన మార్గం లేదు. అలాంటి ఉద్యోగాన్ని సినిమాల కోసం వదిలిపెట్టి నేను రాలేను. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందనేది మనం చెప్పలేం. అందువల్లనే నేను రిటైర్మెంట్ తరువాతనే సినిమాల దిశగా వచ్చాను" అని అన్నారు.



More Telugu News