విమర్శలతో ఉక్కిరిబిక్కిరి.. ఐశ్వర్యరాయ్‌కు క్షమాపణలు చెప్పిన పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్
- మీడియా ఇంటరాక్షన్‌లో ఐశ్వర్యపై రజాక్ అనుచిత వ్యాఖ్యలు
- ప్రపంచవ్యాప్తంగా విమర్శల వెల్లువ
- రజాక్‌ను తప్పుబట్టిన సొంత దేశ క్రికెటర్లు
- నోరుజారానంటూ రజాక్ పశ్చాత్తాపం
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి సొంతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురైన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ దిగొచ్చాడు. తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. ఓ మీడియా ఇంటరాక్షన్‌లో రజాక్ మాట్లాడుతూ పాక్ క్రికెట్‌బోర్డుపై దుమ్మెత్తిపోశాడు. ఈ క్రమంలో సంబంధం లేకున్నా ఐశ్వర్యను లాగి అనుచితంగా మాట్లాడాడు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. మరీ ఇంత చవకబారు వ్యాఖ్యలా? అని అందరూ దుమ్మెత్తి పోశారు. షోయబ్ అక్తర్ వంటి మాజీ క్రికెటర్లు అతడి వ్యాఖ్యలను ఖండించారు.
వెల్లువెత్తుతున్న విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అయిన రజాక్ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. ‘సామా టీవీ’లో మాట్లాడుతూ.. పొరపాటున నోరు జారి అనవసరంగా ఇందులోకి ఐశ్వర్యను తీసుకొచ్చానని చెప్పుకొచ్చాడు. ఆమెకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నాడు. ఒకరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని, అనుకోకుండా అలా జరిగిపోయిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.