సినీనటి నమిత భర్త వీరేంద్ర చౌదరికి నోటీసులు.. కారణం ఇదే!

  • తమిళనాడు ఎంఎస్ఎంఈ చైర్మన్ పదవి ఇప్పిస్తామంటూ జరిగిన మోసం కేసులో సమన్లు
  • విచారణకు హాజరుకావాలని కోరిన పోలీసులు
  • గోపాల్‌స్వామి అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు
సినీనటి నమిత భర్త వీరేంద్ర చౌదరి ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. తమిళనాడు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) కౌన్సిల్‌ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్‌ పదవి ఇప్పిస్తామంటూ గోపాల్‌స్వామి అనే వ్యక్తిని రూ.50 లక్షల మేర మోసం చేసిన కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. విచారణకు హాజరుకావాల్సిందిగా వీరేంద్ర చౌదరితోపాటు మరో ఇద్దరు వ్యక్తులకు కూడా సేలం సెంట్రల్‌ క్రైమ్ బ్రాంచి సమన్లు పంపించిందని సమాచారం.  

ముత్తురామన్‌ అనే వ్యక్తి ఛైర్మన్ పదవి ఇప్పిస్తానని అమ్మాపాళయం జాకిర్‌ ప్రాంతానికి చెందిన గోపాల్‌స్వామి వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడు. కానీ ఆ పదవిని వీరేంద్ర చౌదరి ఇటీవలే చేపట్టడంతో గోపాల్‌స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ముత్తురామన్‌తోపాటు కౌల్సిల్ తమిళనాడు డిపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ దుశ్యంత్ యాదవ్‌ను అక్టోబర్ 31న అరెస్ట్ చేశారు.


More Telugu News