ఇదీ... వరల్డ్ కప్ టీమ్ అంటే...!
- భారత గడ్డపై ఐసీసీ వన్డే వరల్డ్ కప్
- టీమ్ ఆఫ్ ద టోర్నీ పేరిట జట్లను ప్రకటించిన సీఏ, ఫాక్స్ స్పోర్ట్స్
- రోహిత్ శర్మకు దక్కని స్థానం
- తాజాగా వరల్డ్ కప్ టీమ్ ను ఎంపిక చేసిన దినేశ్ కార్తీక్, సైమన్ డౌల్, పార్థివ్
భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ల్లో ప్రదర్శన ఆధారంగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఫాక్స్ స్పోర్ట్స్ మీడియా సంస్థ టీమ్ ఆఫ్ ద టోర్నీ పేరిట జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.
అటు ఆసీస్ క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టులోనూ, ఇటు ఫాక్స్ స్పోర్ట్స్ ఎంపిక చేసిన జట్టులోనూ టీమిండియా సారథి రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. రోహిత్ శర్మ ఈ వరల్డ్ కప్ లో ఇప్పటిదాకా 9 మ్యాచ్ ల్లో 503 పరుగులు చేశాడు. టోర్నీ లీగ్ దశలో అత్యధిక సంఖ్యలో ఫోర్లు, సిక్సులు కొట్టిన ఆటగాడు కూడా రోహిత్ శర్మే. టీమిండియాను ఈ మెగా టోర్నీలో విజయవంతంగా నడిపిస్తూ కెప్టెన్ గా ఫుల్ మార్కులు సంపాదించుకున్నాడు. అలాంటి మేటి ఆటగాడిని విస్మరించడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి.
ఈ నేపథ్యంలో, క్రికెట్ వ్యాఖ్యాతలు దినేశ్ కార్తీక్, సైమన్ డౌల్, పార్థివ్ పటేల్ వరల్డ్ కప్-2023 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ను ఎంపిక చేశారు. ఈ టీమ్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మను ఎంపిక చేశారు. ఎవరూ వంక పెట్టడానికి వీల్లేని విధంగా జట్టును ఎంపిక చేసిన ఈ కామెంటేటర్ త్రయం క్రికెట్ అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
కామెంటేటర్లు ఎంపిక చేసిన జట్టు ఇదే...
రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, విరాట్ కోహ్లీ, రచిన్ రవీంద్ర, హెన్రిచ్ క్లాసెన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, రవీంద్ర జడేజా, మార్కో యన్సెన్, ఆడమ్ జంపా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.