రేపు టీమిండియాతో సెమీస్ నేపథ్యంలో.. న్యూజిలాండ్ సారథి విలియమ్సన్ వ్యాఖ్యలు

  • వరల్డ్ కప్ లో రేపు తొలి సెమీఫైనల్
  • ముంబయి వాంఖెడే స్టేడియంలో టీమిండియా × న్యూజిలాండ్
  • ప్రేక్షకుల నుంచి తమకు మద్దతు లభించకపోవచ్చన్న విలియమ్సన్
వరల్డ్ కప్ లో రేపు (నవంబరు 15) తొలి సెమీఫైనల్ జరగనుంది. ఈ పోరులో అమీతుమీకి టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సన్నద్ధమవుతున్నాయి. సెమీస్ సమరం నేపథ్యంలో కేన్ విలియమ్సన్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ తో మ్యాచ్ ఒక పెద్ద సవాలుగా భావిస్తున్నామని తెలిపాడు. టీమిండియా ప్రస్తుతం అందరికంటే అత్యుత్తమ జట్టు అనలేం కానీ, పెద్ద జట్లలో ఒకటి అని వ్యాఖ్యానించాడు. 

"రేపటి మ్యాచ్ సందర్భంగా వాంఖెడే స్టేడియం టీమిండియా అభిమానులతో నిండిపోతుందని మాకు తెలుసు. కానీ గతంలోనూ ఇలాంటి ప్రేక్షక సమూహాల సమక్షంలో మ్యాచ్ లు ఆడిన అనుభవం మాకుంది. ఇలాంటి స్టేడియాల్లో ఆడే అవకాశం రావడం ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రేక్షకుల నుంచి మాకు మద్దతు లభించనప్పటికీ మేం రాణించిన సందర్భాలు ఉన్నాయి. టీమిండియాతో వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం" అని తెలిపాడు.


More Telugu News