పాతికేళ్లలో గుర్తుకు వచ్చే సీఎంలు ఈ ముగ్గురే... చంద్రబాబు, వైఎస్, కేసీఆర్‍: కేటీఆర్

  • ప్రో బిజినెస్, ప్రో అర్బన్, ప్రో ఐటీ అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబు అన్న కేటీఆర్
  • ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పూర్ అనేది వైఎస్ ఇమేజ్ అన్న మంత్రి కేటీఆర్
  • కేసీఆర్‌లో పైరెండూ కనిపిస్తాయని వెల్లడి 
కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిలపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఇరవై అయిదేళ్లను చూసుకుంటే మనకు గుర్తుకు వచ్చేది కేవలం ముగ్గురు ముఖ్యమంత్రులే అన్నారు. హైదరాబాద్ తాజ్ దక్కన్‌లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ప్రో బిజినెస్, ప్రో అర్బన్, ప్రో ఐటీ అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబు అని; ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పూర్ అనేది వైఎస్ ఇమేజ్ అనీ అన్నారు.

ఇక కేసీఆర్‌లో ఈ రెండూ కనిపిస్తాయన్నారు. కేసీఆర్ అంటే ప్రో అర్బన్, ప్రో రూరల్, ప్రో ఐటీ, ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పూర్ ఉంటాయన్నారు. కేసీఆర్‌ది అరుదైన సమతౌల్యం అన్నారు. కాబట్టి ఆయనను జారవిడుచుకోవద్దన్నారు. కరెంట్ ఇవ్వడం, మంచినీళ్లు ఇవ్వడం మాటల్లో చెప్పినంత సులభమైతే ఇన్నాళ్లు పాలించిన వారు ఎప్పుడో ఇచ్చేవారు కదా? అన్నారు. కేసీఆర్‌కు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంది కాబట్టి ముందుకు సాగుతున్నామన్నారు. గతంలో రైతులు ఆస్తులు అమ్ముకున్నా అప్పులు కట్టలేని దుస్థితి ఉంటే, ఇప్పుడు రైతులు ధీమాగా ఉన్నారన్నారు. ఇది సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వం వల్ల సాధ్యమైందన్నారు.


More Telugu News