ఒబెరాయ్ హోటల్స్ వ్యవస్థాపకుడు పీఆర్ఎస్ ఒబెరాయ్ కన్నుమూత

  • 94 ఏళ్లలో వయసులో కన్నుమూశారని ఒబెరాయ్ గ్రూపు ప్రకటన
  • దేశీయ హోటల్ వ్యాపార ముఖచిత్రాన్ని మార్చిన దిగ్గజం
  • మంగళవారం సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు
ఆతిథ్యరంగ దిగ్గజం, ఒబెరాయ్ గ్రూప్ గౌరవ చైర్మన్ పీఆర్ఎస్ ఒబెరాయ్ మంగళవారం ఉదయం కన్నుమూశారు. 94 ఏళ్ల వయసులో ఆయన ప్రశాంతంగా కన్నుమూశారని ఒబెరాయ్ గ్రూప్ ప్రకటించింది. తమ ప్రియతమ నాయకుడు పీఆర్‌ఎస్ ఒబెరాయ్ కన్నుమూశారని తీవ్ర విచారంతో తెలియజేస్తున్నామని గ్రూపు అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆయన మరణం ఒబెరాయ్ గ్రూపుతోపాటు భారత్, విదేశీ ఆతిథ్య రంగానికి తీవ్రమైన నష్టమని ప్రకటనలో పేర్కొన్నారు. అంత్యక్రియులు మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగనున్నాయని వివరించారు. ఢిల్లీలోని కపషేరాలో ఉన్న భగవంతి ఒబెరాయ్ ఛారిటబుల్ ట్రస్ట్‌ ఫామ్‌లో ఈ కార్యక్రమం జరగనుందని వెల్లడించారు.

పీఆర్ఎస్ ఒబెరాయ్ దూరదృష్టి గల నాయకుడని, అంకితభావం, మక్కువతో ఒబెరాయ్ గ్రూప్, హోటళ్లను ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దారని ప్రకటనలో గ్రూపు పేర్కొంది. ఆయన విస్తరించిన హోటళ్లు భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆతిథ్య రంగాన్ని ప్రభావితం చేస్తాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా పీఆర్ఎస్ ఒబెరాయ్ దేశీయ హోటల్ వ్యాపార ముఖచిత్రానికి కొత్తరూపు తీసుకొచ్చి ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు.


More Telugu News