ఈ రోజు 7 గంటల నుంచి హైదరాబాద్‌లో ‘సదర్’ ట్రాఫిక్ ఆంక్షలు.. ఏయే రూట్లలో అంటే..!
- పలు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున 3 వరకు ట్రాఫిక్ మళ్లింపు
- సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు నోటిఫికేషన్
- సదర్ ఉత్సవ మేళాను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు
హైదరాబాద్ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఒకటైన ‘సదర్ పండగ’కు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరించే ఈ పండుగను దీపావళి ఉత్సవాల్లో భాగంగా పండుగ ముగిసిన రెండో రోజున నిర్వహిస్తారు. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఈ ఉత్సవం ప్రత్యేక విశేషం.
ఈ ఏడాది ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. నారాయణగూడ వైఎంసీఏ మార్గంలో ప్రయాణించే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి బుధవారం వేకువజామున 3 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.
ట్రాఫిక్ మళ్లించిన ప్రాంతాలు ఇవే...
1. బర్కత్‌పురా చమాన్ నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. బర్కత్‌పురా క్రాస్ రోడ్స్, టూరిస్ట్ హోటల్ నుంచి మళ్లించనున్నారు.
2. కాచిగూడ క్రాస్ రోడ్స్ నుంచి వైఎంసీఏ రూట్‌లో వచ్చే వాహనాలను టూరిస్ట్ హోటల్ రోడ్‌లో దారి మళ్లింపు.
3. సదర్ మేళాకు వచ్చే వాహనాలను శాంతి థియేటర్, రెడ్డి కాలేజ్, మెల్కొటే పార్క్, దీపక్ థియేటర్ పార్కింగ్ ఏరియాల్లో పార్క్ చేయాల్సి ఉంటుంది.
4. స్ట్రీట్ నంబర్ 8 నుంచి వైఎంసీఏ వైపు ప్రవేశం లేదు. రెడ్డి కాలేజ్ వద్ద బర్కత్‌పురా వైపు మళ్లీస్తారు.
5. బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ నుంచి రెడ్డి కాలేజి వైపు వచ్చే వాహనాలకు ఎంట్రీ లేదు. నారాయణగూడ క్రాస్ రోడ్స్ మీదుగా మళ్లించనున్నారు.
6. ఓల్డ్ ఎక్సైజ్ ఆఫీస్ నుంచి వచ్చే వాహనాలను విఠల్‌వాడి మీదుగా మళ్లిస్తారు.
7. సికింద్రాబాద్ నుంచి కోఠి వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను నారాయణగూడ క్రాస్ రోడ్స్, బర్కత్‌పురా, బాగ్‌లింగంపల్లి, వీఎస్‌టీ, ఆర్టీసీ రోడ్స్ మీదుగా మళ్లించనున్నారు.
8. విఠల్‌వాడి క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే వాహన ట్రాఫిక్‌ను భవన్స్ న్యూ సైన్స్ కాలేజ్, కింగ్‌కోటి మీదుగా మళ్లీంపు.
9. ఓల్డ్ బర్కత్‌పురా పోస్టాఫీస్ నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలకు ప్రవేశం లేదు. ట్రాఫిక్‌ను క్రౌన్ కేఫ్, బాగ్ లింగంపల్లి వైపు మళ్లింపు.