వాయుకాలుష్యం పెరుగుతున్న వేళ ఈ టిప్స్‌తో చర్మానికి రక్షణ!
- ప్రతిరోజు ఉదయం టిఫిన్‌లో చెంచాడు నెయ్యి తీసుకోవడం మేలు చేస్తుంది
- 2-3 లీటర్ల నీళ్లతోపాటు ఆరోగ్యకరమైన పానీయాలు చర్మ సౌందర్యానికి దోహదం
- మేకప్ వేసుకొని నిద్రపోకూడదంటున్న నిపుణులు
వాయుకాలుష్యం ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుందని అందరికీ తెలిసిందే. శ్వాస సంబంధిత సమస్యలకే కాకుండా చర్మ సంబంధ సమస్యలకు కూడా అది దారితీస్తుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా శరీరంపై వాయు కాలుష్యం ప్రభావం పడకుండా జాగ్రత్త పడవచ్చని చర్మ సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్‌ను మీరు కూడా గమనించండి.
1. ప్రతి రోజు ఉదయం టిఫిన్‌లో ఒక చెంచాడు నెయ్యి ఉండేలా చూసుకోండి. ఇది జీర్ణక్రియ, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు హార్మోన్ల సమతుల్యతను పరిరక్షిస్తుంది. తద్వారా చర్మం మెరిసిపోతుంది.
2. 2-3 లీటర్ల నీళ్లతోపాటు ఆరోగ్యకరమైన కొబ్బరి నీరు, మజ్జిగ, జీలకర్ర నీరుతోపాటు ఆరోగ్యకరమైన ఇతర నీటి పదార్థాలను కూడా తీసుకోవాలి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి.
3. శరీరానికి కొవ్వును తగిన మోతాదులో అందేలా చూసుకోవాలి. నెయ్యి ఒక అద్భుత కొవ్వు. బాదం, వాల్‌నట్, కొబ్బరి, పిస్తా వంటి గింజలను తినడం ద్వారా శరీరానికి కావాల్సిన కొవ్వును తగిన మోతాదులో ఇవ్వొచ్చు. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. మరోవైపు పిజ్జా, బర్గర్, ఇతర జంక్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి.
4. వివిధ రంగుల పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. టమోటా, దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్, దానిమ్మ, క్యాబేజీ, యాపిల్, మామిడి, జామ, నారింజ ఈ విధంగా ఆహారం తినే ప్లేట్‌లో వివిధ రంగుల పదార్థాలు ఉండేలా చూసుకోండి.
5. మేకప్ వేసుకుని ఎప్పుడూ నిద్రపోకూడదు. నిద్రపోయే ముందు ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. తద్వారా రాత్రి పూట చర్మం శ్వాసతీసుకునే అవకాశం ఏర్పడుతుంది.
6. చర్మ ఆరోగ్యానికి తగిన మోతాదులో ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహారం తక్కువగా తీసుకోకూడదు. బరువు తగ్గేందుకు ఆహారపు అలవాట్లను పరిమితం చేస్తే శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పప్పు, అన్నం, రోటీ, కూరగాయలు వంటి ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని తీసుకోవడం చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
7. బయట నుంచి ఇంటికి చేరుకున్న ప్రతిసారీ చేతులతోపాటు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ముఖ సౌందర్యానికి ఈ అలవాటు ఎంతగానో ఉపయోగపడుతుంది.