చంద్రబాబు రాజకీయ సామర్థ్యంపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- చంద్రబాబుకు మరో పదిపదిహేనేళ్లు రాజకీయం చేసే సామర్థ్యం ఉందన్న కేటీఆర్
- టీడీపీ అధినేత... మోదీ కంటే వయస్సులో చిన్నవారేనని గుర్తు చేసిన కేటీఆర్
- చంద్రబాబు విషయంలో లోకేశ్ ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని వ్యాఖ్య
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చంద్రబాబుకు మరో పదిపదిహేనేళ్లు రాజకీయం చేసే సామర్థ్యం ఉందన్నారు. ఆయనకు వయస్సేమీ అయిపోలేదన్నారు. మోదీ కంటే ఆయన చిన్నవారే అన్నారు.
కాగా, చంద్రబాబు అరెస్ట్ సమయంలో హైదరాబాద్‌లో నిరసనలు చేయవద్దంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఆయన మరోసారి వివరణ ఇచ్చారు. శాంతిభద్రతల ఆందోళనల విషయంలో ఆ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు. అందుకే చంద్రబాబు అరెస్ట్ పక్క రాష్ట్రం వ్యవహారం అని చెప్పానన్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో తన వ్యాఖ్యలు జనంలోకి తప్పుగా వెళ్లాయన్నారు. చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, ఏపీ సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తరుచూ టచ్‌లో ఉంటానన్నారు. చంద్రబాబు విషయంలో లోకేశ్ ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని, తమ మధ్య సోదర భావమే ఉందన్నారు.