వైఎస్సార్‌టీపీని బీఆర్ఎస్‌లో విలీనం చేయడానికి వచ్చిన నాయకులకు హరీశ్ రావు స్వాగతం
- వైఎస్సార్‌టీపీని బీఆర్ఎస్‌లో విలీనం చేయడాన్ని స్వాగతించిన హరీశ్ రావు
- గట్టు రామచంద్రరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేతలు బీఆర్ఎస్‌లోకి....
- బీఆర్ఎస్‌లోకి నేతలు, వివిధ జిల్లాల కోఆర్డినేటర్లు, కార్యకర్తలు
వైఎస్సార్‌టీపీని బీఆర్ఎస్‌లో విలీనం చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని మంత్రి హరీశ్ రావు సోమవారం అన్నారు. గట్టు రామచంద్రరావు, సత్యవతిల ఆధ్వర్యంలో పలువురు నేతలు, వివిధ జిల్లాల కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి హరీశ్ రావు గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్‌టీపీని విలీనం చేయడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు.
ఎన్నికల్లో వైఎస్సార్‌టీపీ పోటీ చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ క్రమంలో.. ఆమెను నమ్మి పార్టీలోకి వస్తే తమకు నష్టం చేశారని ఆరోపిస్తూ పలువురు నేతలు షర్మిలకు రాజీనామాలు సమర్పించారు. వీరంతా కలిసి పార్టీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేయడానికి సిద్ధపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తాము భావించి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వైఎస్సార్‌టీపీ నుంచి వచ్చిన నేతలు చెప్పారు.