ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం
- ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు
- ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన కోసం కమిటీ ఏర్పాటు
- కమిటీలో ఇరు పార్టీల నుంచి ముగ్గురేసి చొప్పున సభ్యులు
- నేడు తుది మేనిఫెస్టో రూపకల్పనపై కీలక చర్చ
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు కుదిరిన నేపథ్యంలో, ఉమ్మడి మేనిఫెస్టో రూపాందించాలని ఇరు పార్టీలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకోసం ఇటీవలే ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నేడు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ (టీడీపీ ప్రధాన కార్యాలయం)లో సమావేశమైంది.
టీడీపీ తరఫున ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా ఉన్న యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ పాల్గొన్నారు.
సంక్షేమంతో కూడిన అభివృద్ధి అజెండాగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు ఈ కమిటీ కృషి చేయనుంది. టీడీపీ-జనసేన మినీ మేనిఫెస్టోలో ఇప్పటికే కొన్ని అంశాలు ఉండగా, వాటికి అదనంగా మరికొన్ని అంశాలు జోడించి తుది మేనిఫెస్టోను రూపొందించనున్నారు.