టైగర్-3 థియేటర్లలో అభిమానులు బాణసంచా కాల్చడంపై ఆందోళన వ్యక్తం చేసిన సల్మాన్ ఖాన్
- సల్మాన్ ఖాన్, కత్రినా జంటగా టైగర్-3
- నవంబరు 12న దీపావళి సందర్భంగా రిలీజ్
- థియేటర్లలో అభిమానుల హంగామా
- ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దన్న సల్మాన్ ఖాన్
- హాయిగా సినిమా ఎంజాయ్ చేయాలని పిలుపు
బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన తాజా చిత్రం టైగర్-3 నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్లలో సల్మాన్ ఖాన్ అభిమానులు బాణసంచా కాల్చుతూ హంగామా చేశారు. నాసిక్ జిల్లాలోని మాలేగావ్ లో ఓ థియేటర్లో అభిమానులు తెర ముందు బాణసంచా కాల్చుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ వీడియో సల్మాన్ ఖాన్ దృష్టికి వెళ్లింది. తన అభిమానులు సినిమా థియేటర్ లోపల బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి వద్దంటూ విజ్ఞప్తి చేశారు.
"టైగర్-3 సినిమా ప్రదర్శితమవుతున్న సందర్భంగా థియేటర్ల లోపల బాణసంచా కాల్చుతున్న విషయం తెలిసింది. ఇది చాలా ప్రమాదకరం. మన ప్రాణాలను, ఇతర ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకుండా, హాయిగా సినిమాను ఆస్వాదిద్దాం. సురక్షితంగా ఉండండి" అంటూ సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో స్పందించారు.
కాగా, టైగర్-3 చిత్రం తొలిరోజున దేశవ్యాప్తంగా రూ.44 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.