దీపావళి బాణసంచాతో ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం
- ఢిల్లీలో మరోసారి పైపైకి వాయు కాలుష్యం స్థాయులు
- 24 గంటల వ్యవధిలో 140 శాతం వరకు పెరిగిన వైనం
- నిన్న ఉదయం 7 గంటల నుంచి ఇవాళ్టి వరకు గాలి నాణ్యతలో తీవ్ర మార్పు
సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి సందర్భంగా ప్రజలు బాణసంచా కాల్చడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, దీపావళి బాణసంచా కారణంగా ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. 24 గంటల వ్యవధిలోనే కాలుష్యం 100 శాతానికి పైగా పెరిగినట్టు గుర్తించారు. నిన్న ఉదయం 7 గంటల నుంచి ఇవాళ్టి వరకు గాలి నాణ్యతలో తీవ్ర మార్పులు వచ్చినట్టు నిర్ధారణ అయింది. ఈ స్థాయిలో వాయు కాలుష్యం తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
దీపావళికి ముందు గాలి నాణ్యత సూచీ ఢిల్లీ కాలుష్యాన్ని 215-220 పాయింట్లుగా చూపించింది... దీపావళి తర్వాత అది 315-320కి పెరిగిందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. చాలామంది ప్రజలు బాణసంచాకు దూరంగా ఉన్నారని, కానీ కొన్ని ప్రాంతాల్లో బీజేపీ నేతలే బాణసంచా కాల్చేలా ప్రజలను రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు.