కోహ్లీలా స్వార్థంతో ఉంటేనే బెటరేమో!: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వ్యాఖ్య
- పాక్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి
- వరల్డ్ కప్ నుంచి పాక్ నిష్క్రమణపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందన
- పాక్ క్రికెటర్ హఫీజ్‌పై సెటైర్
తన 49వ సెంచరీ చేసే క్రమంలో విరాట్ కోహ్లీ మందకొడిగా ఆడటం ప్రత్యర్థుల చేతిలో అస్త్రంగా మారింది. టీం అవసరాలకంటే కోహ్లీ స్వలాభానికే ప్రాధాన్యమిస్తాడంటూ పాక్ ఆల్ రౌండర్ మహమ్మద్ హఫీజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కానీ, ఇవే కామెంట్స్ ఆధారంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, మహమ్మద్ హఫీజ్‌ను అవకాశం దొరికినప్పుడల్లా టార్గెట్ చేస్తున్నాడు.
తాజాగా పాక్ తన చివరి లీగ్ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ చేతిలో ఒడిపోవడంపై వాన్ మరోసారి స్పందించాడు. పాక్ టీం, హఫీజ్‌ను టార్గెట్ చేశాడు. ‘‘పాకిస్థానీ బ్యాటర్లు కూడా విరాట్ కోహ్లీలా కాస్తంత స్వార్థంతో ఉండాలేమో’’ అంటూ హఫీజ్‌ను ట్యాగ్ చేశాడు. దీంతో, మైఖేల్ వాన్ వ్యాఖ్యలు ప్రన్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.