ప్రపంచకప్‌లో విజయవంతమైన స్పిన్నర్‌గా రవీంద్ర జడేజా.. అనిల్ కుంబ్లే రికార్డు బద్దలు
- 9 మ్యాచుల్లో 16 వికెట్లు తీసుకున్న రవీంద్ర జడేజా
- 1996 ప్రపంచకప్‌లో అనిల్ కుంబ్లే, 2011లో యువరాజ్ సింగ్ 15 వికెట్లు కూల్చిన వైనం
- ఈ ప్రపంచకప్‌లో 14 వికెట్లతో జడేజా వెనకే కుల్దీప్ యాదవ్
ఈ ప్రపంచకప్‌లో బంతితో ఇరగదీస్తున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు. ప్రపంచకప్‌లో విజయవంతమైన ఇండియన్ స్పిన్నర్‌గా రికార్డులకెక్కాడు. నిన్న నెదర్లాండ్స్‌పై రెండు వికెట్లు తీసిన జడేజా.. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 16 వికెట్లు తీసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 5 వికెట్లు సాధించాడు.
9 మ్యాచుల్లో 16 వికెట్లు సాధించిన జడేజా గతంలో అనిల్ కుంబ్లే సాధించిన రికార్డును తుడిచిపెట్టేశాడు. 1996 ప్రపంచకప్‌లో కుంబ్లే 15 వికెట్లు సాధించాడు. 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ కూడా 15 వికెట్లు తీసుకోగా, ఈ ప్రపంచకప్‌లో కుల్దీప్ యాదవ్ 14 వికెట్లు తీసుకుని జడేజా వెనకే ఉన్నాడు.