ప్రపంచకప్‌లో ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా భారత్ నయా రికార్డ్
- రౌండ్ రాబిన్ దశలో అన్ని గేముల్లో విజయం సాధించిన ఏకైక జట్టుగా భారత్
- గతంలో శ్రీలంక, ఆస్ట్రేలియా 8 చొప్పున మ్యాచుల్లో విజయం
- టోర్నీలో అజేయంగా నిలిచిన రెండు జట్లకు మాత్రమే ప్రపంచకప్
ప్రపంచకప్‌లో భాగంగా నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగుల తేడాతో విజయం సాధించిన భారతజట్టు లీగ్ దశలో అన్ని మ్యాచుల్లోనూ గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ విజయంతో మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచకప్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో అపజయమన్నదే ఎరుగని ఏకైక జట్టుగా తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకుంది. ఈ నెల 15న (బుధవారం) న్యూజిలాండ్‌తో సెమీస్‌లో తలపడనుంది.
ఈ ప్రపంచకప్‌లో లీగ్ దశలో ఆడిన 9 మ్యాచుల్లోనూ టీమిండియా విజయం సాధించింది. ఇప్పటి వరకు మరే జట్టు ఈ ఘనత సాధించలేదు. 1996లో శ్రీలంక, 2003లో ఆస్ట్రేలియా ఎనిమిదేసి మ్యాచుల్లో విజయం సాధించాయి. టోర్నీలో అజేయంగా నిలిచిన రెండు జట్లు మాత్రమే ఇప్పటి వరకు ప్రపంచకప్ సాధించాయి. 1975, 79లో వెస్టిండీస్, 2003, 2007లో ఈ ఘనత అందుకున్నాయి. ఇప్పుడు భారత్ కనుక ప్రపంచకప్ గెలిస్తే అది మరో చరిత్ర అవుతుంది.