హరీష్ రావు నటనకు తెలంగాణ యువకులు భావోద్వేగానికి లోనయ్యారు: రేవంత్ రెడ్డి
- కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటన రిమాండ్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్న
- నిందితుడు రాజును మీడియాకు ఎందుకు చూపలేదని మండిపాటు
- గువ్వల బాలరాజుపై దాడి కుట్రగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌ను ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ దాడి విషయంలో మంత్రి హరీష్ రావు నటనకు తెలంగాణ యువకులు భావోద్వేగానికి లోనయ్యారని ఎద్దేవా చేశారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసిన నిందితుడిని ఇప్పటివరకు మీడియా ఎదుట ఎందుకు ప్రవేశపెట్టలేదని, దాడి ఘటన విచారణ వివరాలు బయటపెట్టాలని అన్నారు. ఇప్పటివరకు నిందితుడు రాజు రిమాండ్ రిపోర్టు బయటపెట్టలేదని ఆయన అన్నారు. కుట్రలు జరగబోతున్నాయని కేటీఆర్ అన్నారని, ఆయన మాటలను సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సర్కారు, మంత్రి హరీష్ రావుపై ఆయన విమర్శల దాడి చేశారు.
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి ఘటనపై స్పందిస్తూ.. అదంతా డ్రామా అని రేవంత్ కొట్టిపారేశారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సర్వసాధారణమని వ్యాఖ్యానించారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి, గువ్వల బాలరాజుపై దాడి ఘటనలు కుట్రలో భాగమేనని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి ఘటనలను సృష్టిస్తారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికలకు ముందు కోడికత్తి ఘటన, బెంగాల్‌లో మమతా బెనర్జీ కాలి గాయం ఘటనలే ఇందుకు తార్కాణమని ఉదహరించారు.