రాధికా కుమారస్వామి పాన్ ఇండియన్ మూవీ ‘అజాగ్రత’ ఫస్ట్ లుక్ ఇదిగో!

  • రాధికా కుమారస్వామి ప్రధానపాత్రలో అజాగ్రత
  • శశిధర్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ చిత్రం
  • రాధికా కుమారస్వామి పుట్టినరోజు సందర్భంగా ఏడు భాషల్లో ఫస్ట్ లుక్ విడుదల
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య, కన్నడ రాధికా కుమారస్వామి నటి అలియాస్ కుట్టి రాధిక ‘అజాగ్రత’ అనే చిత్రంతో పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకులను పలకరించనున్నారు. కర్ణాటకలో సూపర్ హిట్ బ్యానర్ అయిన శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. 

ఈ చిత్రాన్ని శశిధర్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రాబోతోన్న ఈ మూవీ కోసం అత్యద్భుతమైన సెట్లను వేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి రవి రాజ్ నిర్మాత. 

రాధిక కుమారస్వామి బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఏడు భాషల్లో ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఎరుపు రంగు చీర, భారీ నగలతో రాధిక నిండుగా కనిపిస్తున్నారు. ఇక పోస్టర్‌లో దీపాల వెలుగులు కూడా కనిపిస్తున్నాయి. దీపావళికి పర్‌ఫెక్ట్ పోస్టర్‌లా కనిపిస్తోంది. ది షాడోస్ బిహైండ్ ది కర్మ అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. 

ఓ బాలీవుడ్ స్టార్ సైతం ఈ మూవీలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ యాక్షన్ చిత్రంలో శ్రేయాస్ తల్పడే, సునీల్, రావు రమేశ్, ఆదిత్య మీనన్, దేవ్ రాజ్, వినయ ప్రసాద్, శ్రావణ్ ఇలా ఎంతో మంది సౌత్ స్టార్లు నటిస్తున్నారు.


More Telugu News