కాంగ్రెస్ నేత వివేక్ వెంకట్ స్వామి వద్ద రూ.1 కోటి అప్పు తీసుకున్న సీఎం కేసీఆర్

  • ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్
  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కోటిన్నర అప్పు ఇచ్చినట్టు వెల్లడి
  • సోషల్ మీడియాలో ఆసక్తికరంగా  మారిన వివేక అఫిడవిట్
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకి రూ.1.06 కోట్లు అప్పు ఇచ్చానని  చెన్నూరు బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నేత వివేక్ వెంకట స్వామి వెల్లడించారు. తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు కాంగ్రెస్ కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కోటిన్నర రూపాయలు అప్పు ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. వివేక్ వెంకటస్వామి అఫిడవిట్‌కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 

కాగా వివేక్ వెంకట స్వామి తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో అత్యంత ధనిక వ్యక్తిగా నిలిచారు. తన మొత్తం ఆస్తి విలువ రూ.606.2 కోట్లుగా అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు. చరాస్తుల రూపంలో రూ.380.76 కోట్లు, స్థిరాస్తుల రూపంలో రూ.225.91 కోట్ల ఆస్తి ఉందని వెల్లడించారు. ఇక దంపతులిద్దరి పేరిట రూ.45.44 కోట్లు అప్పు ఉందని అఫిడవిట్‌లో వెంకట్ స్వామి వివరించారు. ఇదిలావుండగా ఎన్నికల ప్రచారంలో వివేక్ వెంకటస్వామి దూసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌ను ఓడించడమే లక్ష్యంగా ప్రచారపర్వాన్ని కొనసాగిస్తున్నారు.


More Telugu News