వరల్డ్ కప్ లో నేడు చిట్టచివరి లీగ్ మ్యాచ్... ఒక్క మార్పు లేకుండా బరిలోకి టీమిండియా, నెదర్లాండ్స్ జట్లు
- అక్టోబరు 5న మొదలైన వరల్డ్ కప్
- నేటితో ముగియనున్న లీగ్ దశ
- సెమీస్ స్థానాలు ఖరారు
- నేడు టీమిండియా, నెదర్లాండ్స్ మ్యాచ్ లాంఛనప్రాయం
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
భారత గడ్డపై అక్టోబరు 5న ప్రారంభమైన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో నేడు చిట్టచివరి లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో ఆతిథ్య టీమిండియా, నెదర్లాండ్స్ తలపడుతున్నాయి. టీమిండియా ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడి 8 విజయాలతో తిరుగులేని రికార్డుతో బరిలో దిగుతోంది. నెదర్లాండ్స్ ఆడిన 8 మ్యాచ్ ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో చివర ఉంది.
టీమిండియా ప్రస్తుతం ఉన్న భీకర ఫామ్ ను పరిగణనలోకి తీసుకుంటే నెదర్లాండ్స్ పరిస్థితి ఊహించడం సులభమే. టోర్నీలో ఇప్పటికే సెమీస్ స్థానాలు ఖరారైన నేపథ్యంలో, ఇవాళ్టి మ్యాచ్ లాంఛనప్రాయమే.
ఈ పోరుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా, నెదర్లాండ్స్ జట్లు ఎలాంటి మార్పుల్లేకుండా బరిలో దిగుతున్నాయి.