ఆ ఆధారాలేవో సీఐడీకి ఇవ్వొచ్చుగా.. పురందేశ్వరిని కోరిన విజయసాయిరెడ్డి
- పురందేశ్వరి టార్గెట్‌గా విజయసాయి విమర్శనాస్త్రాలు
- లిక్కర్ స్కాంలో తన వద్దనున్న ఆధారాలను సీఐడీకి ఇవ్వాలని సూచన
- సాక్షిగా వాంగ్మూలం ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్న వైసీపీ నేత
ఇటీవలి కాలంలో బీజేపీ నేత పురందేశ్వరిని టార్గెట్ చేసుకున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తరచూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యక్తిగతంగానూ ఆమెను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. కన్నతండ్రికి కూడా ముద్ద పెట్టలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. 8 ఏళ్లు కేంద్రమంత్రిగా పనిచేసిన ఆమెకు డబ్బు వ్యామోహం తప్ప మరోటి లేదని తూర్పారబట్టారు. మరీ ముఖ్యంగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ అయిన తర్వాత పురందేశ్వరిని విజయసాయి లక్ష్యంగా చేసుకున్నారు.
తాజాగా మరోమారు పురందేశ్వరిపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏ-3గా నమోదైన లిక్కర్ కుంభకోణం కేసులో తన వద్ద ఆధారాలు ఉన్నాయంటున్న పురందేశ్వరి వాటిని సీఐడీకి అందజేయాలని సూచించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు సమాచారంతో తమపై నిందలు వేయడం సరికాదన్నారు. వాస్తవాలు బయటపడాలంటే సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా చూడాలని కోరారు.