ఏపీ మంత్రి బొత్సకు బైపాస్ సర్జరీ

  • ఈ నెల 6న విశాఖలో సాధారణ వైద్య పరీక్షలు
  • గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు గుర్తింపు
  • హైదరాబాద్ లో చికిత్స.. నిలకడగా మంత్రి ఆరోగ్యం
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఈ నెల 6న శృంగవరపుకోటలో జరిగిన వైసీపీ బస్సు యాత్రలో మంత్రి పాల్గొన్నారు. ఈ యాత్రలోనే మంత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన మంత్రి బొత్సను విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు.. గుండెలో మూడు చోట్ల పూడికలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ కు తరలించారు.

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంత్రి బొత్స సత్యనారాయణను చేర్పించగా.. శనివారం వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఈ సర్జరీ జరిగింది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. నెల రోజుల వరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు మంత్రి బొత్స కుటుంబ సభ్యులు తెలిపారు.


More Telugu News