282 మంది ప్రవాసులపై కువైట్ ఉక్కుపాదం

  • దేశంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు
  • రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన 282 మంది అరెస్ట్
  • వారిపై చట్టపరమైన చర్యలకు రెడీ అవుతున్న అధికారులు
ఇటీవలి కాలంలో ప్రవాసుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న కువైట్ తాజాగా మరో 282 మందిపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఖైతాన్, హవాలి, అల్ దజీస్, కబ్డ్, బ్రాయే సలేం, సల్హియా, మహబౌలా, ఫహాహీల్ మార్కెట్స్, ఫర్వానియా తదితర ప్రాంతాల్లో  రెసిడెన్సీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన తనిఖీలో వీరు పట్టుబడ్డారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న ప్రవాసులను గుర్తించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగాయి. అరెస్ట్ అయిన వారందరూ రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్టు అధికారులు పేర్కొన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  రెసిడెన్సీ నిబంధనల సమగ్రతను కాపాడడం, కార్మిక చట్టాల నిబద్ధతను కాపాడేందుకు ఈ తనిఖీలు ఉపయోగపడతాయని వివరించారు.


More Telugu News