నామినేషన్లతో బాధితుల నిరసన... అత్యధికంగా గజ్వేల్‌లో 157 నామినేషన్ల దాఖలు
- గజ్వేల్‌లో 127 మంది 157 వరకు నామినేషన్లు దాఖలు
- 100 మంది వరకు వట్టెనాగులపల్లి శంకర్ హిల్స్ ప్లాట్ బాధితులు
- ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ తెరిపించాలని జగిత్యాల చెరుకు రైతుల పోటీ
- నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున కూడా బరిలోకి పలువురు
తెలంగాణ అసెంబ్లీ నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తోన్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడి నుంచి 127 మంది 157 నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు బాధితులు సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో 100 మంది వట్టెనాగులపల్లి శంకర్ హిల్స్ ప్లాట్ బాధితులు ఉన్నారు. జగిత్యాల చెరుకు రైతులు కూడా పోటీ చేసేందుకు మొగ్గు చూపారు. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున కూడా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎక్కువమంది ధరణి సహా వివిధ బాధితులు ఉన్నారు. నిరసన తెలిపే ఉద్దేశంలో భాగంగా వీరు నామినేషన్లు దాఖలు చేశారు.
గజ్వేల్ తర్వాత మేడ్చల్ నియోజకవర్గం నుంచి 125 నామినేషన్లు, కామారెడ్డి నుంచి 102, మునుగోడు నుంచి 83, సూర్యాపేట నుంచి 81, మిర్యాలగూడ నుంచి 79, సిద్దిపేట నుంచి 76, నల్గొండ నుంచి 71, హుజూరాబాద్ నుంచి 70, కోదాడ నుంచి 66, రాజేంద్రనగర్ నుంచి 64, మల్కాజిగిరి నుంచి 60, ఎల్బీ నగర్ నుంచి 62, శేరిలింగంపల్లి నుంచి 58, సిరిసిల్ల నుంచి 42 నామినేషన్లు దాఖలయ్యాయి.