బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్ 22 మందికే టిక్కెట్ ఇచ్చింది: తలసాని

  • బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని తలసాని ధీమా
  • మేనిఫెస్టోలో లేని వాటిని కూడా బీఆర్ఎస్ ఇచ్చిందన్న తలసాని
  • కాంగ్రెస్ బీసీ నేతలు టిక్కెట్ల కోసం ఢిల్లీలో ధర్నాలు చేశారని వ్యాఖ్య
బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ పట్ల విశ్వాసంతో ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మేనిఫెస్టోలో లేనివి కూడా బీఆర్ఎస్ నెరవేర్చిందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్ కేవలం 22 అసెంబ్లీ టిక్కెట్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడటం విడ్డూరమన్నారు. ప్రజాప్రతినిధులను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారన్నారు. ప్రజలు అతని భాషను గమనించాలని కోరారు. రేవంత్ రెడ్డి ఒక్కడికే ఆ భాష వస్తుందా? అన్నారు. తమకు టిక్కెట్లు దక్కలేదని కాంగ్రెస్ బీసీ నేతలు ఢిల్లీలో ధర్నా చేసిన విషయం కూడా చూశామన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్డు షో, 25న కేసీఆర్ బహిరంగ సభ ఉంటాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభంజనం ఉంటుందన్నారు.


More Telugu News