ఆ రెండు హిట్ సినిమాలు కృష్ణ చేయవలసిందట!
- 'ఖైదీ' కథ కృష్ణ విన్నారన్న మాధవరావు
- ఆ కథ చిరంజీవికి బాగుంటుందని చెప్పిన కృష్ణ
- 'కటకటాల రుద్రయ్య' కథను కృష్ణంరాజు దగ్గరికి పంపిన కృష్ణ
- ఆ సినిమా హిట్ అవుతుందని ఆయన ముందే చెప్పాడట
కృష్ణ పర్సనల్ మేకప్ మెన్ గా చాలాకాలం పాటు పనిచేసిన మాధవరావు, తాజా ఇంటర్వ్యూలో కృష్ణ గురించిన విషయాలను ప్రస్తావించారు. 'ఖైదీ' సినిమా కథ ముందుగా కృష్ణగారి దగ్గరకే వచ్చింది. ఆ కథ అంతా విన్న తరువాత ఆయన 'ఇది చిరంజీవికైతే కరెక్టుగా ఉంటుంది .. ఆయనతో చేసుకోండి' అని చెప్పారని అన్నారు.
ఇక 'కటకటాల రుద్రయ్య' కథ కూడా ముందుగా కృష్ణగారి దగ్గరికే వచ్చిందని మాధవరావు అన్నారు. ఈ కథ కృష్ణంరాజుగారికి నప్పుతుందనీ, ఆయన చేస్తే బాగుంటుందని కృష్ణగారు చెప్పారు. ఆయనతోనే చేయాలనుకుంటున్నట్టు నిర్మాతలు ఒత్తిడి చేసినా ఆయన వినిపించుకోలేదని అన్నారు.
'కటకటాల రుద్రయ్య' సినిమా విడుదల సమయంలో నేను .. కృష్ణగారు హైదరాబాదులోనే ఉన్నాము. ముందుగా థియేటర్ వారికి కబురుచేసి ఆ సినిమాకి వెళ్లాము. ఆ సినిమా చూడగానే సూపర్ హిట్ అవుతుందని కృష్ణగారు చెప్పారు. కృష్ణంరాజు బాగున్నాడనీ .. బాగా చేశాడని అన్నారు" అని చెప్పారు.