ఆప్ఘనిస్థాన్ కోచ్ ట్రాట్ విచారం.. కొన్ని అవకాశాలు కోల్పోయామని వ్యాఖ్య
- ఎన్నో లక్ష్యాలతో వన్డే వరల్డ్ కప్‌ను ప్రారంభించామన్న కోచ్ ట్రాట్
- అన్ని మ్యాచులూ గెలిచి ఉంటే బాగుండేదని వ్యాఖ్య
- టీంకు మంచి భవిష్యత్తు ఉందని స్పష్టీకరణ
వన్డే వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్థాన్ ప్రయాణం ముగిసింది. దిగ్గజాలను మట్టికరిపించినప్పటికీ ఆడిన మ్యాచుల్లో కేవలం నాలుగే గెలుచుకోవడంతో ఆప్ఘన్లు ప్రపంచపోటీల నుంచి నిష్క్రమించక తప్పలేదు. అయితే, టీం క్రీడాకారుల పోరాటపటిమకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. దీనిపై కోచ్ ట్రాట్ తాజాగా స్పందించారు. తాము కోల్పోయిన అవకాశాలపై విచారం వ్యక్తం చేస్తూనే టీం భవిష్యత్తు మాత్రం అద్భుతంగా ఉండబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.
‘‘ఎన్నో ఆశయాలతో మేం ఇక్కడ కాలుపెట్టాము. నాలుగు మ్యాచులు గెలిచిన మాట వాస్తవమేకానీ, కొన్ని అవకాశాలు కోల్పోయాం. ఆ మ్యాచుల్లోనూ గెలిచి ఉండాల్సింది’’ అని కామెంట్ చేశాడు. బంగ్లాదేశ్‌తో తొలిమ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి దిగ్గజాలను ఓడించి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపోయేలా చేసింది.