కోదాడలో పద్మావతికి మద్దతుగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారం

  • బీజేపీ, బీఆర్ఎస్ రహస్య దోస్తులని డీకే శివకుమార్ విమర్శలు
  • ఇప్పటి వరకు సచివాలయానికి రాని కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కు పంపిద్దామని వ్యాఖ్య
  • ప్రజలు తెలంగాణ తలరాతను ఈ ఎన్నికల్లో మారుస్తున్నారన్న డీకే శివకుమార్
బీజేపీ, బీఆర్ఎస్ రహస్య దోస్తులని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ విమర్శించారు. శుక్రవారం ఆయన కోదాడలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీజేపీ నేతలు హైదరాబాద్‌కు వచ్చి మాత్రమే కేసీఆర్‌పై విమర్శలు చేస్తారన్నారు. కేసీఆర్ ఇప్పటి వరకు సచివాలయానికి రాలేదని, ఆయనను ఫామ్ హౌస్‌కు పంపించేద్దామన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ వంటివి అరవై ఏళ్లు దాటినా చెక్కు చెదరలేదన్నారు.

కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే బీటలు వారిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడమంటే తెలంగాణ తలరాతను ప్రజలు మార్చడమే అన్నారు. ఈసారి కోదాడలో పద్మావతి 25 వేల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఈ ప్రాంతం సిమెంట్ పరిశ్రమలకు చాలా పేరు పొందిందని తెలిపారు.


More Telugu News