ట్రేడింగ్ చివర్లో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 72 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 30 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2 శాతానికి పైగా లాభపడ్డ ఎన్టీపీసీ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు చివర్లో లాభాల్లోకి మళ్లాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 72 పాయింట్లు లాభపడి 64,905కి పెరిగింది. నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 19,425 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపించాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (2.12%), టెక్ మహీంద్రా (1.27%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.05%), బజాజ్ ఫైనాన్స్ (0.83%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.75%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-1.86%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.13%), టైటాన్ (-0.86%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.60%), నెస్లే ఇండియా (-0.48%).