నా అకౌంటెంట్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- తన కుటుంబ సభ్యులకు చెందిన 30 కంపెనీలపై ఐటీ దాడులు జరుగుతున్నాయన్న పొంగులేటి
- బీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని వ్యాఖ్య
- ఐటీ అధికారులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏమిటని ప్రశ్న
తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పొంగులేటి మాట్లాడుతూ ఐటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపైన, తన కుటుంబ సభ్యులకు చెందిన 30 కంపెనీల పైన ఐటీ దాడులు చేస్తున్నారని... ప్రభుత్వ ఒత్తిడితోనే ఈ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతోనే ఐటీ దాడులు చేస్తున్నారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు కలిసి ఈ దాడులు చేయిస్తున్నాయని చెప్పారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని... ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని అన్నారు.
తన అకౌంటెంట్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఒంటికాలుపై నిలబెట్టారని ఐటీ అధికారులపై మండిపడ్డారు. పరిధిని దాటి ఐటీ అధికారులు వ్యవహరించడం దారుణమని అన్నారు. ఐటీ అధికారుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని... వారు వారి హద్దుల్లో ఉండాలని చెప్పారు. ఐటీ రూల్స్ తెలియని వారు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు. ఐటీ అధికారులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఏమైనా ఆధారాలు దొరికితే కేసులు పెట్టాలే కానీ... మనుషులను హింసించడం ఏమిటని మండిపడ్డారు.