కేవలం 21 నిమిషాల్లోనే అయిపోయిన తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు

  • డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం
  • 2.25 లక్షల టికెట్లను కేటాయించిన టీటీడీ
  • రూ.300 టికెట్ల కోసం భక్తుల నుంచి విపరీతమైన స్పందన
శ్రీవారి భక్తులకు డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లను విడుదల చేసింది. కేవలం 21 నిమిషాల్లోనే ఈ టికెట్లు అయిపోయాయి. మొత్తం 2.25 లక్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను భక్తులకు అందించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు భక్తుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. 14 నిమిషాల వ్యవధిలోనే 80 శాతం టికెట్ల అమ్మకాలు పూర్తయ్యాయి. టీటీడీ నేటి మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది. సాయంత్రం 5 గంటలకు వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు.


More Telugu News