దాసరిని తలచుకుని భావోద్వేగానికి గురైన బాలయ్య.. ‘భగవంత్ కేసరి’ విజయోత్సవం వెనక కారణం చెప్పిన అగ్రహీరో
- సినిమాకు పనిచేసిన వారిని అందరిముందు సత్కరించేందుకే కార్యక్రమం ఏర్పాటు చేశామన్న బాలకృష్ణ
- ఇండస్ట్రీకి దాసరి పెద్దదిక్కులా ఉండేవారన్న బాలయ్య
- రాఘవేంద్రరావు రావడంతో నిండుదనం వచ్చిందని ప్రశంస
- భగవంత్ కేసరి హిందీ వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పుకున్న హీరో
భగవంత్ కేసరి సినిమా విజయోత్సవ సభలో అగ్రహీరో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. దర్శక దిగ్గజం దివంగత దాసరి నారాయణరావును గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఇండస్ట్రీకి ఆయన పెద్ద దిక్కుగా, తలలో నాలుకలా ఉండేవారని పేర్కొన్నారు. ఆయన ఉండివుంటే ఎంతో బాగుండేదని పేర్కొన్నారు. ఓ సినిమా విషయంలో ప్రేక్షకాదరణను మించి మరేమీ ఉండదన్నారు. ప్రయోగాత్మక సినిమాలు, వైవిధ్య భరిత పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం నాన్నగారి నుంచే తనకు వచ్చిందన్నారు.
నాకు నేనే పోటీ
ప్రేక్షకులకు మంచి కథలను పరిచయం చేస్తే విజయం సాధించి తీరుతుందనడానికి ఈ సినిమా ఒక నిదర్శనమని అన్నారు. తనకు మరెవరితోనూ పోటీ లేదని, తన సినిమాలతో తనకే పోటీ అని పేర్కొన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలన్నీ సవాలుతో కూడుకున్నవేనని చెప్పారు. భగవంత్ కేసరి సినిమాకు పనిచేసిన వారిని మీ ముందు సత్కరించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
హిందీలోనూ భగవంత్ కేసరి
దాసరి లేరన్న లోటు ఉన్నా.. రాఘవేంద్రరావుగారు రావడంతో కార్యక్రమానికే నిండుదనం వచ్చిందని బాలయ్య పేర్కొన్నారు. దర్శకుడు అనిల్‌కు మంచి భవిష్యత్తు ఉందని, ఈ సినిమా విషయంలో పంపిణీదారులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. వారు ఆనందంగా ఉంటేనే పరిశ్రమ బాగుంటుందన్న బాలయ్య.. భగవంత్ కేసరి సినిమా త్వరలోనే హిందీలోనూ విడుదలవుతుందని, తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నట్టు తెలిపారు.