లైవ్ లోకి రండి... దీపావళి వేడుక చేసుకుందాం: స్వామి నిత్యానంద
- వివాదాలకు నెలవుగా స్వామి నిత్యానంద
- అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన వైనం
- విదేశాల్లో తలదాచుకున్న నిత్యానంద
- కైలాస పేరుతో సొంతంగా దేశం ఏర్పాటు చేసుకున్నట్టు ప్రకటన
అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద విదేశాల్లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. కైలాస పేరుతో దేశం ఏర్పాటు చేసుకున్నట్టు ప్రకటించిన స్వామి నిత్యానంద తన ప్రతినిధులను ఐరాస కార్యక్రమాలకు కూడా పంపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
తాజాగా, కైలాస దేశాధినేత హోదాలో దీపావళి వేడుకలకు ఆహ్వానం పలికారు. నేను భగవంతుడి అవతారం అని గుర్తించాక, ఇది నాకు పుట్టినరోజులా అనిపిస్తోందని స్వామి నిత్యానంద వెల్లడించారు. పరమశివుడు పరమశక్తిలాగా ఈ దేహంలో ప్రతిష్టాపన జరిగిన రోజు అని పేర్కొన్నారు.
ఈ నెల 11న సాయంత్రం 7.30 గంటలకు సోషల్ మీడియా లైవ్ లోకి రావాలని, కైలాస దేశాధ్యక్షుడిగా తన ప్రసంగం ఉంటుందని తెలిపారు.