తనయుడి భవిష్యత్ పై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • కొడుకును క్రికెటర్ గా చూడాలనుకోవడంలేదన్న యువీ
  • గోల్ఫ్ కిట్ కొనిస్తే... క్రికెట్ బ్యాట్ పట్టుకున్నాడని వెల్లడి
  • ఒకవేళ క్రికెటర్ అవుతానంటే కచ్చితంగా ప్రోత్సహిస్తానని స్పష్టీకరణ
భారత్ మాజీ డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన కుమారుడు ఓరియన్ కీచ్ సింగ్ భవిష్యత్తుపై ఆసక్తికర రీతిలో స్పందించాడు. ఓరియన్ కోసం ప్లాస్టిక్ గోల్ఫ్ సెట్ కొన్నానని వెల్లడించాడు. అతడ్ని తాను క్రికెటర్ గా చూడాలనుకోవడంలేదని తెలిపాడు. 

అయితే, ఓసారి ఓరియన్ తమ బంధువుల ఇంటికి వెళ్లాడని, అక్కడ క్రికెట్ బ్యాట్ ఉంటే, దాన్ని తీసుకుని ఆడడం మొదలుపెట్టాడని యువీ వివరించాడు. ఓరియన్ గనుక క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకుంటానంటే ఓ తండ్రిగా కచ్చితంగా తన వంతు ప్రోత్సాహం అందిస్తానని తెలిపాడు. 

ఇప్పటిరోజుల్లో పిల్లలపై ఒత్తిడి అధికంగా ఉంటోందని, క్రికెటర్ల పిల్లలపై ఆ ఒత్తిడి ఇంకా ఎక్కువగా ఉంటోందని యువీ పేర్కొన్నాడు. ఓ క్రికెటర్ కుమారుడు క్రికెట్ లోకి అడుగుపెడితే, అతడి ఆటను తండ్రి ఆటతో పోల్చి చూస్తుంటారని, మీడియాతో పాటు అందరూ అతడిపై దృష్టి పెడుతుంటారని, తద్వారా అధిక ఒత్తిడి నెలకొంటుందని అభిప్రాయపడ్డాడు.


More Telugu News