తుంగతుర్తి బీ-ఫామ్ నాకే... పార్టీ మార్పుపై స్పందించిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్
- తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేసిన దయాకర్
- పార్టీ మార్పు ప్రచారాన్ని అభిమానులు, కార్యకర్తలు నమ్మవద్దని విజ్ఞప్తి
- తుంగతుర్తి సహా ప్రతి అంశంలో కాంగ్రెస్ తనకు అండగా ఉందని ధీమా
- తుంగతుర్తి టిక్కెట్ తనకే వస్తుందన్న దయాకర్
తాను కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ గురువారం ఖండించారు. తాను కాంగ్రెస్‌ను వీడటం లేదని, ఏ పార్టీలోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా ఆయన పార్టీ మార్పు అంశంపై స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతోన్న ప్రచారాన్ని తన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది తనపై కుట్రపూరితంగా ఇలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనకు అండగా ఉందని, తనకే తుంగతుర్తి బీఫామ్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రేపు (శుక్రవారం) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. తుంగతుర్తిలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి నామినేషన్ వేస్తానన్నారు. తుంగతుర్తి అంశంతో పాటు ఎప్పుడూ కూడా పార్టీ తనకు వ్యతిరేకంగా లేదన్నారు. కానీ సోషల్ మీడియాలో, బయటా తాను పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం చేస్తున్నారని, దీనిని ఖండిస్తున్నానన్నారు. అందరూ సంయమనం పాటించాలన్నారు. తనకు కచ్చితంగా బీ ఫామ్ వస్తుందన్నారు.