కోహ్లీతో మాట్లాడకపోవడానికి కారణం బయటపెట్టిన యువరాజ్‌సింగ్
- ధోనీ-తాను క్లోజ్ ఫ్రెండ్స్ కాదని ఇప్పటికే చెప్పిన యువరాజ్
- కోహ్లీ బిజీగా ఉంటాడు కాబట్టి మాట్లాడనన్న యువీ
- నాటి చీకూ.. నేటి విరాట్ ఒక్కటి కాదన్న మాజీ స్టార్
- కోహ్లీ తనను తాను రొనాల్డో అనుకుంటాడన్న యువీ
టీమిండియా మాజీ స్టార్ మహేంద్రసింగ్ ధోనీతో తన అనుబంధం గురించి వివరించిన యువరాజ్ సింగ్.. తామిద్దరం క్లోజ్‌ఫ్రెండ్స్ కాదని చెప్పుకొచ్చాడు. తాజాగా, విరాట్ కోహ్లీతోనూ తన అనుబంధం గురించి బయటపెట్టాడు. కోహ్లీ చాలా బిజీగా ఉండడంతో అతడితో తాను మాట్లాడనని చెప్పుకొచ్చాడు. టీఆర్ఎస్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ యువీ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘కోహ్లీతో మీరు టచ్‌లో ఉంటారా?’ అన్న ప్రశ్నకు యువరాజ్ బదులిస్తూ.. ‘అతడు చాలా బిజీగా ఉంటాడు. కాబట్టి నేను అతడిని డిస్టర్బ్ చేయను. యువ కోహ్లీ పేరు చీకూ.. నేటి చీకూ విరాట్ కోహ్లీ.. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది’ అని చెప్పుకొచ్చాడు.
ఇదే పోడ్‌కాస్ట్‌లో ధోనీతో స్నేహంపై యువరాజ్ మాట్లాడుతూ.. తామిద్దం స్నేహితులమే కానీ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం కాదని చెప్పుకొచ్చాడు. అయితే, జట్టు కోసం ఎల్లప్పుడూ వందశాతం కష్టపడ్డామని గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ ఫుట్‌బాల్ నైపుణ్యంపై యువరాజ్ జోక్ చేస్తూ.. కోహ్లీ ఇండియన్ క్రికెట్‌లో క్రిస్టియానో రొనాల్డో అని వ్యాఖ్యానించాడు.
‘‘కోహ్లీ తాను గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడినని అనుకుంటాడు. కానీ అతడి కంటే నేనే మెరుగు. అతడు కుర్రాడు. బాగా పరిగెడతాడు. కాబట్టి తనను తాను క్రిస్టియానో రొనాల్డో అనుకుంటాడు. కానీ, కాదు. ఇండియన్ క్రికెట్‌లో మాత్రం అతడే రొనాల్డో అని యువరాజ్ వివరించాడు.
టీమిండియాలో యువరాజ్ స్టార్ ఆటగాడిగా ఉన్నప్పుడు కోహ్లీ టీమిండియాలోకి వచ్చాడు. అప్పటికే యువరాజ్ రెండు వన్డే ప్రపంచకప్‌లు, ఒక టీ20 ప్రపంచకప్ ఆడేశాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. యువరాజ్ పంజాబ్‌కు చెందినవాడు కాగా, కోహ్లీ ఢిల్లీ వ్యక్తి. ఇద్దరూ చిన్న వయసులోనే తమ నైపుణ్యంతో అదరగొట్టారు. ఇద్దరూ అండర్-19 నుంచి వచ్చినవారే. యువరాజ్‌లానే కోహ్లీ కూడా అతి తక్కువ సమయంలో జట్టులో తానేంటో నిరూపించుకున్నాడు.