నెదర్లాండ్ బౌలర్ వాన్ బీక్ బౌలింగ్‌లో షాకింగ్ రీతిలో బౌల్డ్ అయిన జో రూట్

  • రివర్స్ హిట్‌కు ప్రయత్నించి ఔట్ అయిన రూట్
  • పెద్దగా బౌన్స్ లేకుండా వేగంగా వెళ్లి వికెట్లను తాకిన బంతి
  • సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన ఐసీసీ
వన్డే వరల్డ్ కప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు ఎట్టకేలకు రెండో విజయం దక్కింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌పై గెలిచింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన హైలెట్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్‌ను నెదర్లాండ్స్ బౌలర్ లోగాన్ వాన్ బీక్ క్లీన్ బౌల్డ్ చేసిన తీరు మ్యాచ్‌లో ప్రత్యేకంగా నిలిచింది. 

ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో 21వ ఓవర్‌లో ఈ ఔట్ నమోదయ్యింది.వాన్ బీక్ ఒక లెంగ్త్ డెలివరీ సంధించగా జో  రూట్ తనకు అలవాటైన రివర్స్ హిట్‌కి ప్రయత్నించాడు. ఇన్నర్ సర్కిల్‌లో ఉన్న థర్డ్‌మ్యాన్‌ పైనుంచి బంతిని తరలించాలని చూశాడు. కానీ బాల్ వేగంగా రూట్‌ను దాటుకెళ్లి వికెట్లను గిరాటేసింది. బంతి పెద్దగా బౌన్స్ లేకుండా వెళ్లి వికెట్లను తాకింది. ఈ పరిణామంతో రూట్ షాక్‌కు గురయ్యాడు. క్లీన్ బౌల్డ్‌గా పెవీలియన్‌కు చేరుకోవాల్సి వచ్చింది. దీంతో బౌలర్ వాన్ బీక్ తన బౌలింగ్‌తో ఆశ్చర్యపరిచాడు. 

నిజానికి వాన్ బీక్ మొదటి నాలుగు ఓవర్లలో ఏకంగా 45 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ మ్యాచ్‌లో అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్న డేవిడ్ మలన్, జో రూట్‌ల భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. అద్భుత బంతితో 85 పరుగుల భాగస్వామ్యాన్ని వాన్ బీక్ బ్రేక్ చేసినట్టయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) సోషల్ మీడియాలో షేర్ చేసింది.


More Telugu News