పవన్ కల్యాణ్, షర్మిలపై మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు
- కేసీఆర్ ఏకే 47 వంటి వాడని... డీకేలు, పీకేలు పనిచేయరన్న హరీశ్ రావు
- కేసీఆర్‌పై ఎవరు పోటీ చేసినా స్వాగతిస్తామని వ్యాఖ్య
- పెద్దవారిపై పోటీ చేస్తే తామేదో పెద్దవారం అవుతామని భావిస్తున్నారని విమర్శలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ఏకే 47 అని, ఆయన ముందు డీకేలు, పీకేలు పని చేయరని... కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎన్నికలు అన్నప్పుడు పోటీ సహజమే అన్నారు. కాబట్టి గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలలో కేసీఆర్‌పై ఎవరు పోటీ చేసినా స్వాగతిస్తామన్నారు. కొంతమంది కేసీఆర్‌పై పోటీ పేరుతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, పెద్దవారిపై పోటీ చేస్తే తామేదో పెద్దవారం అవుతామని భావిస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్‌కు సరితూగే నాయకుడు లేరన్నారు. ముఖ్యమంత్రి కష్టపడి తెలంగాణను తీసుకువచ్చారన్నారు.
రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులు అంతా ఒక్కటవుతున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ ద్రోహులు అన్నారు. పవన్ బీజేపీకి మద్దతిస్తే, షర్మిల కాంగ్రెస్‌కు అండగా ఉంటున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తే గజ్వేల్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కాగా కేసీఆర్ పై గజ్వేల్‌లో బీజేపీ నేత ఈటల రాజేందర్, కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.