నేటి నుంచి కేటీఆర్‌ రోడ్‌ షోలు.. షెడ్యూల్ ఇదిగో

  • ఈరోజు నుంచి 28వ తేదీ వరకు కేటీఆర్ రోడ్ షోలు
  • 15వ తేదీన కూకట్ పల్లిలో రోడ్ షో
  • 10వ తేదీన సిరిసిల్లలో నామినేషన్ వేయనున్న కేటీఆర్
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే మంత్రి కేటీఆర్ తలమునకలై ఉన్నారు. ఈరోజు నుంచి ఆయన బహిరంగసభలతో పాటు రోడ్ షోలను కూడా నిర్వహించనున్నారు. ఈరోజు నుంచి 28వ తేదీ వరకు తన ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ను కేటీఆర్ విడుదల చేశారు. ఈ 20 రోజుల్లో ఆయన జీహెచ్ఎంసీ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో రోడ్ షోలు, మరో 14 నియోజకవర్గాల్లో రోడ్ షోలతో పాటు బహిరంగసభలను నిర్వహించనున్నారు. 10వ తేదీన ఆయన సిరిసిల్లలో నామినేషన్ వేయనున్నారు.

కేసీఆర్ రోడ్ షోలు, బహిరంగసభల షెడ్యూల్:
  • ఈరోజు - సంగారెడ్డి నియోజకర్గంలో రోడ్‌షో, బహిరంగ సభ  
  • 9న - ఆర్మూర్‌, కొడంగల్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగ సభ
  • 10న - సిరిసిల్లలో నామినేషన్‌ వేయనున్న కేటీఆర్
  • 11న - జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశం. శామీర్‌పేటలో ఎస్టీ సెల్‌ ప్రతినిధులతో భేటీ
  • 15న - కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో రోడ్‌షో
  • 16న - అంబర్‌పేట, ముషీరాబాద్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో
  • 17న - గోషామహల్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో
  • 18న - జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో
  • 19న - మెదక్‌, దుబ్బాక నియోజకవర్గాల్లో యువ సమ్మేళనం... సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ (కంటోన్మెంట్‌)లో రోడ్‌షో
  • 20న - ఎల్బీనగర్ నియోజకవర్గంలో రోడ్‌షో21న - శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో
  • 22న - మల్కాజ్‌గిరి, ఉప్పల్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో
  • 23న - కోరుట్ల నియోజకవర్గంలో రోడ్‌షో, బహిరంగసభ... వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్‌, చందుర్తి, మేడిపల్లి, రుద్రంగి మండలాల్లో రోడ్‌షో
  • 24న - అచ్చంపేట, మక్తల్‌ నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగసభ
  • 26న - మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగ సభ
  • 27న - ఖానాపూర్‌, చొప్పదండి నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగ సభ
  • 28న - వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగసభ.


More Telugu News