ఆప్యాయంగా పవన్ కల్యాణ్ భుజం తట్టిన ప్రధాని మోదీ... వీడియో ఇదిగో!
- ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ
- ప్రధాని మోదీ పక్కనే పవన్ కల్యాణ్‌కు సీటు
- జనసేనాని పట్ల మోదీ చూపిన ప్రేమ, ఆదరణ, గౌరవంతో ఉప్పొంగిన పవన్ అభిమానులు
ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ భుజం తట్టారు. ఈ ఘటన ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ సందర్భంగా చోటు చేసుకుంది. ప్రధాని మోదీ రాకకు ముందే పవన్ కల్యాణ్ వేదిక పైకి వచ్చి కూర్చున్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రధాని సభకు వచ్చిన వారికి, వేదికపై ఉన్న వారికి నమస్కరించుకుంటూ వెళ్లి తన స్థానంలో కూర్చున్నారు. జనసేనానికి ప్రధాని పక్కనే సీటును కేటాయించారు. పవన్ కూర్చుంటుండగా మోదీ భుజంపై తట్టారు. ప్రతిగా జనసేనాని నమస్కారం పెట్టారు.
సభ జరుగుతుండగా మధ్యలో ఓసారి పక్కనే ఉన్న పవన్‌ను పిలిచి ఏదో మాట్లాడారు. వారిద్దరు కొన్ని క్షణాలు మాట్లాడుకోవడం కనిపించింది. మోదీ ఏదో అడగగా... పవన్ కల్యాణ్ సమాధానం చెప్పినట్లుగా ఉంది. చివరలో ప్రధాని వెళ్లే సమయంలో బీజేపీ నేతలందరికీ నమస్కరిస్తూ వీడ్కోలు పలికారు. పవన్ చేతిలో చేయి వేసి వీడ్కోలు పలికారు. పవన్ కల్యాణ్‌కు మోదీ ప్రత్యేక గౌరవం ఇచ్చినందుకు, ఆప్యాయత కనబరిచినందుకు జనసేన కేడర్, పవన్ అభిమానులు ఉప్పొంగిపోతున్నారు.