గోషామహల్, నాంపల్లి నియోజక వర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే...!
- గోషామహల్ నుంచి నంద కిషోర్ వ్యాస్ పోటీ
- నాంపల్లి నుంచి ఆనంద్ కుమార్ గౌడ్ పోటీ
- మొత్తం తొమ్మిది మందికి బీఫామ్స్ అందించిన కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిగిలిన 9 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. గోషామహల్ నుంచి నందకిషోర్ వ్యాస్, నాంపల్లి నుంచి ఆనంద్ కుమార్ గౌడ్‌ను ప్రకటించారు. గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్, నాంపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ రెండు స్థానాలకు ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేసింది. అలంపూర్ నుంచి ఇదివరకు అబ్రహంను ప్రకటించిన బీఆర్ఎస్ ఆయనను మార్చి విజయుడికి టిక్కెట్ ఇచ్చింది. ఈ ముగ్గురు సహా తొమ్మిది నియోజకవర్గాల అభ్యర్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఫామ్ అందించారు. దీంతో మొత్తం 119 నియోజకవర్గాలకు బీఫామ్‌లు అందించారు. సీఎం కేసీఆర్ ఇదివరకే 110 మందికి బీఫామ్ ఇచ్చారు.
ఎక్కడి నుంచి ఎవరు అంటే?
చాంద్రాయణ గుట్ట నుంచి ఎం సీతారాం రెడ్డి, యాకుత్ పురా నుంచి సామా సుందర్ రెడ్డి, బహుదూర్‌పుర నుంచి ఇనాయత్ అలీ బక్రీ, మలక్‌పేట నుంచి తీగల అజిత్ రెడ్డి, కార్వాన్ నుంచి అయిందాల కృష్ణ, చార్మినార్ నుంచి సలావుద్దీన్ లోడి, నాంపల్లి నుంచి సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్, గోషామహాల్ నుంచి నంద కిషోర్ వ్యాస్, అలంపూర్ నుంచి విజేయుడికి బీఫామ్ అందించారు.