బాణసంచా నియంత్రణ ఆదేశాలు ఢిల్లీకే కాదు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి: సుప్రీంకోర్టు
- బాణసంచా నిషేధించాలంటూ పిటిషన్
- విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
- హానికర రసాయనాలపై గతంలో ఇచ్చిన ఆదేశాలు వర్తిస్తాయని వెల్లడి
- అన్ని రాష్ట్రాలు బాణసంచా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశం
దేశమంతా దీపావళి సంబరాలకు సిద్ధమవుతున్న తరుణంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. బాణసంచా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. బాణసంచా నియంత్రణ ఆదేశాలు ఒక్క ఢిల్లీకే పరిమితం అనుకోవద్దని, అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం స్పష్టం చేసింది.
హానికర రసాయనాలపై గతంలో ఇచ్చిన ఆదేశాలు దేశమంతా ఒకేలా వర్తిస్తాయని పేర్కొంది. తమ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ ఉండాలని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. బాణసంచా వినియోగం నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. రాజస్థాన్ లో బాణసంచా కొనడం, అమ్మడం, వినియోగించడం నిషేధించాలని పిటిషనర్ కోరారు.