రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్ ను ఒత్తిడిలోకి నెట్టిన నవీనుల్ హక్

  • వాంఖెడే స్టేడియంలో ఆసక్తికరంగా ఆసీస్, ఆఫ్ఘన్ మ్యాచ్
  • 50 ఓవర్లలో 5 వికెట్లకు 291 పరుగులు చేసిన ఆఫ్ఘనిస్థాన్
  • ఛేజింగ్ లో 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్
ముంబయి వాంఖెడే స్టేడియంలో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 291 పరుగులు చేసింది. 

292 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలో దిగిన ఆసీస్ ను ఆఫ్ఘన్ పేసర్ నవీనుల్ హక్ హడలెత్తించాడు. తన స్వింగ్ బౌలింగ్ తో రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్ ను ఒత్తిడికి గురిచేశాడు. తొలుత ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (0)ను డకౌట్ చేసిన నవీనుల్ హక్... ఆ తర్వాత ధాటిగా ఆడుతున్న మిచెల్ మార్ష్ ను అవుట్ చేసి ఆఫ్ఘన్ శిబిరంలో ఆనందం నింపాడు. 

మార్ష్ 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు బాది 24 పరుగులు చేశాడు. మార్ష్ ఊపు చూస్తే ఊచకోత ఖాయం అన్న సూచనలు కనిపించాయి కానీ, ఓ చక్కని బంతితో అతడిని నవీనుల్ హక్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. ప్రస్తుతం ఆసీస్ 7 ఓవర్లలో 2 వికెట్లకు 43 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 17, మార్నస్ లబుషేన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.


More Telugu News