అసలంక సెంచరీ... శ్రీలంక 279 ఆలౌట్

  • వరల్డ్ కప్ లో నేడు శ్రీలంక × బంగ్లాదేశ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లా
  • 105 బంతుల్లో 108 పరుగులు చేసిన అసలంక
ఢిల్లీలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. 

శ్రీలంక ఇన్నింగ్స్ లో మిడిలార్డర్ బ్యాట్స్ మన్ చరిత అసలంక సెంచరీ సాధించడం హైలైట్. అసలంక 105 బంతుల్లో 108 పరుగులు చేశాడు. ఈ ఎడమచేతివాటం ఆటగాడు 6 ఫోర్లు, 5 సిక్సులు బాదాడు. లంక ఇన్నింగ్స్ లో ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 41, సమరవిక్రమ 41, ధనంజయ డిసిల్వా 34, మహీశ్ తీక్షణ 22 పరుగులు చేశారు. ఓపెనర్ కుశాల్ పెరీరా (4), కెప్టెన్ కుశాల్ మెండిస్ (19) విఫలమయ్యారు. సీనియర్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ అవుట్ రూపంలో వెనుదిరిగాడు. 

బంగ్లాదేశ్ బౌలర్లలో తాంజిమ్ హసన్ సకిబ్ 3, కెప్టెన్ షకిబ్ అల్ హసన్ 2, షోరిఫుల్ ఇస్లామ్ 2, మెహిదీ హసన్ 1 వికెట్ తీశారు. 

280 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ జట్టు 5 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. ఓపెనర్ టాంజిద్ హసన్ 9 పరుగులు చేసి మధుశంక బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో లిట్టన్ దాస్ (10 బ్యాటింగ్), నజ్ముల్ హుస్సేన్ శాంటో (6 బ్యాటింగ్) ఉన్నారు.


More Telugu News