దీపావళి సెలవులో మార్పు చేసిన ఏపీ ప్రభుత్వం

  • తొలుత ప్రకటించిన జాబితాలో నవంబరు 12న దీపావళి సెలవు 
  • ఇప్పుడా సెలవును నవంబరు 13కి మార్చిన ఏపీ ప్రభుత్వం
  • సాధారణ సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు
ఏపీ సర్కారు దీపావళి సెలవు విషయంలో మార్పు చేసింది. వాస్తవానికి గతంలో విడుదల చేసిన 2023 సెలవుల జాబితాలో దీపావళి పండుగకు నవంబరు 12న సెలవు ప్రకటించారు. అయితే, ఇప్పుడు దీపావళి సెలవును నవంబరు 13కి మార్చుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 

నవంబరు 12న ఆదివారం వచ్చింది. ఇంతకుముందు నవంబరు 13వ తేదీ ఆప్షనల్ హాలిడేగా ఉండగా, ఇప్పుడు దాన్ని ఏపీ ప్రభుత్వం సాధారణ సెలవుగా మార్పు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


More Telugu News