కాంగ్రెస్ కు 70 సీట్లు పక్కాగా వస్తాయి: జగ్గారెడ్డి
- బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడూ ఒకటేనన్న జగ్గారెడ్డి
- కాంగ్రెస్ అధికారంలోకి కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపాటు
- కవిత అరెస్ట్ ఎందుకు ఆగిపోయిందని ప్రశ్న
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ కు 70 సీట్లు పక్కాగా వస్తాయని ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సింగిల్ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నామని చెప్పారు. మజ్లిస్ పార్టీ హైదరాబాద్ కే పరిమితమవుతుందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు ఒకటేనని చెప్పారు. బీజేపీ ఆడుతున్న ఆటలో బీఆర్ఎస్, ఎంఐఎంలు పావులు అని అన్నారు. ఈ పార్టీలన్నీ కలిపి కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను జైలుకు పంపిస్తామని బండి సంజయ్ చెప్పారని... ఆమె అరెస్ట్ ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను పెంచే పనిలో బీజేపీ ఉందని అన్నారు. టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డి లలో పోటీ చేస్తున్నారని తెలిపారు. ఎక్కడి నుంచి పోటీ చేయడానికైనా తాను సిద్ధమేనని చెప్పారు. మంత్రి హరీశ్ రావు వంద పంచులు వేసినా వేస్టేనని... తాను ఒక్క పంచ్ వేస్తే చాలని అన్నారు.